పదేళ్లుగా మూతపడిన బడికి పూర్వవైభవం : జిల్లా కలెక్టర్ కె. హరిత

by Taduka Kalyani |

గత పది కాలాలుగా నిరుపయోగంగా మారిన ప్రభుత్వ పాఠశాల భవనానికి తక్షణమే మరమ్మత్తులు పూర్తి చేసి, అన్ని రకాల మౌలిక వసతులతో తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.

పదేళ్లుగా మూతపడిన బడికి పూర్వవైభవం : జిల్లా కలెక్టర్ కె. హరిత
X

దిశ,కాగజ్‌నగర్ : గత పది కాలాలుగా నిరుపయోగంగా మారిన ప్రభుత్వ పాఠశాల భవనానికి తక్షణమే మరమ్మత్తులు పూర్తి చేసి, అన్ని రకాల మౌలిక వసతులతో తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం కాగజ్‌నగర్ పట్టణంలోని 13వ వార్డు కాపువాడలో గత 10 సంవత్సరాలుగా మూతపడి ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని విద్యాశాఖ అధికారులతో కలిసి ఆమె స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భవన స్థితిగతులను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి ఎన్నో వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని, పదేళ్లుగా మూతపడి ఉన్న ఈ పాఠశాలను పునఃప్రారంభించడం ద్వారా స్థానిక విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, త్వరితగతిన భవనానికి అవసరమైన మరమ్మత్తులు చేసి, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించి బడిని పునఃప్రారంభించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు వృథా కాకుండా, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇటువంటి భవనాలను పునరుద్ధరించడం ఎంతో అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వాసాల ప్రభాకర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story