- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ వైపు వలసల జోరు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు గులాబీ జెండా నీడకు చేరుకుంటున్నారు.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు గులాబీ జెండా నీడకు చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే బుధవారం హుజురాబాద్ మండలంలోని రాజపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఘనంగా చేరికల కార్యక్రమం
రాజపల్లి గ్రామ సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జూపాక సింగిల్ విండో చైర్మన్ అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన ప్రముఖులు వీరే..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వీడి బీఆర్ఎస్ లో చేరిన వారిలో రాజపల్లి గ్రామ ఉప సర్పంచ్ శనిగరం అయిలయ్య (బీజేపీ)తో పాటు పలువురు వార్డు సభ్యులు, బూత్ స్థాయి బాధ్యులు ఉన్నారు.బీజేపీ నుండి వార్డు సభ్యులు,బీజేపీ బూత్ అధ్యక్షుడు ఈర్ల రాజు, ఈర్ల ప్రవీణ్, మునిగాల పోచయ్య, శనిగరపు సమ్మయ్య, నోముల కరుణాకర్, పత్తి శ్రీనివాస్ రెడ్డి, శనిగరపు రవి. కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షుడు ఎండి రమీజ్, రాజపల్లి సోషల్ మీడియా కాంగ్రెస్ ఇంచార్జ్ చెవుల సాయి కుమార్. "ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి గ్రామ గ్రామాన విశేష ఆదరణ లభిస్తోంది. కొత్తగా చేరిన నాయకులతో రాజపల్లిలో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి పునరంకితం..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతుండటంతో నియోజకవర్గంలో ఇతర పార్టీల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రాజపల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






