Zomato: జొమాటో మాతృసంస్థపై పన్ను శాఖ కొరడా

by S Gopi |

ఇందులో రూ. 6.49 కోట్ల జీఎస్టీ బకాయితో పాటు, దానికి అదనంగా రూ. 2.50 కోట్ల వడ్డీ, మరో రూ. 65 లక్షల జరిమానా కలిపి మొత్తం రూ. 9.63 కోట్లు చెల్లించాలని ఏపీ అధికారులు ఆదేశించారు.

Zomato: జొమాటో మాతృసంస్థపై పన్ను శాఖ కొరడా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో మాతృసంస్థ ‘ఎటర్నల్’కు ఆంధ్రప్రదేశ్ పన్ను అధికారుల నుంచి భారీ జీఎస్టీ డిమాండ్ నోటీసులు అందాయి. 2023, ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన బిజినెస్ లావాదేవీలకు సంబంధించి.. కంపెనీ కట్టాల్సిన అసలు పన్ను (అవుట్‌పుట్ ట్యాక్స్) కంటే తక్కువ చెల్లించిందనే అభ్యంతరంతో అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇందులో రూ. 6.49 కోట్ల జీఎస్టీ బకాయితో పాటు, దానికి అదనంగా రూ. 2.50 కోట్ల వడ్డీ, మరో రూ. 65 లక్షల జరిమానా కలిపి మొత్తం రూ. 9.63 కోట్లు చెల్లించాలని ఏపీ అధికారులు ఆదేశించారు. ఈ ట్యాక్స్ నోటీసుల వ్యవహారాన్ని ఎటర్నల్ సంస్థ స్వయంగా స్టాక్ ఎక్స్చేంజ్‌లకు సమర్పించిన నివేదికలో అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ జీఎస్టీ నోటీసుల వల్ల తమ కంపెనీకి వచ్చే నష్టమేమీ లేదని, దీనివల్ల ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉండదని ఎటర్నల్ స్పష్టం చేసింది. ఈ పన్ను అంశంలో తమ వైపు న్యాయం ఉందని, అవసరమైతే చట్టపరమైన మార్గాల్లో పైఅధికారులను లేదా కోర్టును ఆశ్రయించి ఈ నోటీసులను సవాలు చేస్తామని కంపెనీ పేర్కొంది.

Next Story