- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు.

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని 9వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా పట్టణంలో లింకు రోడ్డు లను కలిపే రింగు రోడ్డు , బైపాస్ రోడ్డు నిర్మాణాలతో పాటు, త్వరలోనే మంగల్ పేట్ నుంచి శివాజీ చౌక్ వరకు రోడ్డు 50 పీట్ల విస్తరణ రూ.46 కోట్లు మంజూరు అయినవి అని త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ మార్గానికి సంబంధించిన రోడ్డు విస్తరణ మార్కింగ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే అత్యాధునిక రోడ్డు అంతర్గత డ్రైనేజీ పనులను రూపుదిద్దబోతున్నామని ఆయన వెల్లడించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మున్సిపల్ పరిధిలో త్వరలోనే ఒక అద్భుతమైన 'అర్బన్ ఫారెస్ట్ పార్క్'ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. అనంతరం మనూరు మండలం పరిధిలోని తోర్నాల్ అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు. నాగల్ గిద్ద మండలంలోని గూడూరు కు బైక్ పైన వెళ్లి అమార్చిన నూతన మోటర్లు పనితీరును వాటి ఫిట్టింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాస్పరి ప్రశాంతి , ఖేడ్ ఎస్సై శ్రీశైలం ,బి రాజు,రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ముంతాజ్ సెట్,మోహిద్,శెట్టి శంకర్ మున్సిపల్ కో ఆప్షన్ శెట్టి శంకర్, తదితరులు పాల్గొన్నారు.






