- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి అదృశ్యం కేసు.. ఊహించని మలుపులు
కాకినాడ జిల్లా తునిలో శనివారం రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) తుని(Tuni)లో శనివారం రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాపతో పాటే కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. అంతేకాకుండా ఈ మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులకు ఒక పెద్ద క్లూ ఇచ్చింది.
కుక్కు ఇచ్చి క్లూతో అలర్ట్ అయిన పోలీసులు
మరోవైపు చిన్నారి జాడ కోసం వందలాది మంది పోలీసులు దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా పెంపుడు కుక్క వచ్చి నేరుగా చిన్నారి తల్లి వద్దకు వెళ్లి ఆమెను గట్టిగా లాగడం ప్రారంభించింది. ఆ తర్వాత అది వేగంగా సమీపంలోని అటవీ ప్రాంతం వైపు పరుగు తీసింది. కుక్క ప్రవర్తనలో ఏదో తెలియని ఆరాటం కనిపింది. దీంతో చిన్నారికి సంబంధించిన జాడను చూపించే ప్రయత్నంగా భావించి అది పరుగు తీసిన అడవి ప్రాంతం వైపునకే పోలీసులు, రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంకా దొరకని చిన్నారి ఆచూకీ
అయితే చిన్నారి ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి చిన్నారిని తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు మాత్రం విలపిస్తూనే ఉన్నారు. చిన్నారి సురక్షితంగా కనిపించాలని పలువురు కోరుకుంటున్నారు.






