- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ శిక్షణ..
కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా అత్యాధునిక సాంకేతిక అవకాశాలు దక్కాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

దిశ,సూర్యాపేట; కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు కూడా అత్యాధునిక సాంకేతిక అవకాశాలు దక్కాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను భవిష్యత్తు సాంకేతికత వైపు నడిపించేందుకు సూర్యాపేట జిల్లా అధికారులు డిజిటల్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య ద్వారా విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ-ఫైబర్, సూపర్ టీచర్ ఎడ్యు రిఫార్మ్స్ సంస్థల సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెల రోజుల ఏఐ శిక్షణా కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆవిష్కరించారు. ఈ శిక్షణా కార్యక్రమం 2026 జూన్ 15 నుండి జూలై 11 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. మొదటి విడతగా జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో దీనిని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో రాణించడానికి ఏఐ అక్షరాస్యత ఎంతో కీలకమని, ఇది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి భారతదేశ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో వారిని భాగస్వాములను చేస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ సాధనాలను బాధ్యతాయుతంగా ఎలా వాడుకోవాలో నేర్పడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
పైలెట్ ప్రాజెక్టు గా సూర్యాపేట
ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సూర్యాపేట జిల్లాలోని వందలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయితే, రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను విస్తరించడానికి ఇదొక రోల్ మోడల్‌గా నిలుస్తుందని విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ గఫ్ఫార్, మరియు టీ-ఫైబర్, సూపర్ టీచర్ ఎడ్యు రిఫార్మ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.






