మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

by Nallavelli.Anjaneyulu |

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై కమాన్‌పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
X

దిశ, కమాన్‌పూర్ : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై కమాన్‌పూర్ మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పద్ధతి మార్చుకోవాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు. బుధవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకర్ల‌ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్.ఎస్. అన్వర్, జిల్లా కార్యదర్శి గాండ్ల మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుపై పుట్ట మధు అసభ్య పదజాలంతో, నిరాధార ఆరోపణలు చేయడం తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని వారు పేర్కొన్నారు.


ప్రజా సమస్యల పరిష్కారం, మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇద్దరు నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం వల్ల వాస్తవాలు మారవని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై దుష్ప్రచారం చేసినంత మాత్రాన ప్రజల మద్దతు తగ్గదని, ప్రజలు నిజాన్ని గుర్తిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గడప కృష్ణమూర్తి, మల్యాల తిరుపతి, శివ శంకరయ్య, మల్యాల మహేష్ గౌడ్, కొత్తపల్లి సతీష్, దాసరి గట్టయ్య, చాట్ల గట్టయ్య, వెంగలి రాజయ్య గౌడ్, నగునూరి నరసయ్య గౌడ్, ఇనగంటి ప్రభాకర్ రావు పాల్గొన్నారు.

Next Story