భార్యతో గొడవ.. తలదించుకుని ఆలోచనలో పడ్డ గొరిల్లా! జపాన్ జూలో కనిపించిన అరుదైన దృశ్యం

by Ramesh Naini |

జపాన్‌లోని నాగోయాలో ఉన్న హిగాషియామా జూకి చెందిన ఓ గొరిల్లా వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

భార్యతో గొడవ.. తలదించుకుని ఆలోచనలో పడ్డ గొరిల్లా! జపాన్ జూలో కనిపించిన అరుదైన దృశ్యం
X

దిశ, డైనమిక్ బ్యూరో: జపాన్‌లోని నాగోయాలో ఉన్న హిగాషియామా జూకి చెందిన ఓ గొరిల్లా వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తన భాగస్వామితో గొడవపడిన తర్వాత ఆ గొరిల్లా అచ్చం మనిషిలాగా.. కాలు మీద చేయి వేసుకుని, తల దించుకుని తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయిన దృశ్యాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

భర్తల పరిస్థితి ఇంతేనా?

భార్యతో గొడవపడిన తర్వాత భర్తల పరిస్థితి అచ్చం ఇలాగే ఉంటుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. గొడవ తర్వాత ఏం మాట్లాడాల్సింది, ఏం తప్పు జరిగింది అని ఓ మనిషి ఆలోచించినట్లుగానే గొరిల్లా హావభావాలు ఉన్నాయంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలోని గొరిల్లాను తొలుత 13 ఏళ్ల ‘కియోమాసా’గా గుర్తించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా తన రూపంతో గుర్తింపు పొందిన ప్రసిద్ధ ‘షబానీ’ (Shabani) అనే సిల్వర్‌బ్యాక్ గొరిల్లా కుమారుడు. అయితే వీడియో పాపులర్ అయిన తర్వాత, అందులో ఉన్నది కియోమాసా కాదని, సాక్షాత్తూ ఆ షబానీ గొరిల్లానే అని మరికొందరు వాదిస్తున్నారు.

ఏఐ (AI) సృష్టి అని అనుమానాలు

జంతువులలో కూడా ఇంత స్పష్టంగా మనిషి భావోద్వేగాలు కనిపిస్తాయా అని పలువురు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం ఇది నిజమైన వీడియో కాకపోవచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో సృష్టించిన ఫేక్ వీడియో అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. వీడియో అసలు కథ ఎలా ఉన్నప్పటికీ, అచ్చం మనిషి ఆలోచనా తీరును, బ్రేకప్, గొడవల తర్వాత వచ్చే భావోద్వేగాలను ప్రతిబింబిస్తున్న ఈ గొరిల్లా వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరినీ ఆకర్షిస్తోంది.

Next Story