- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ ఫ్యాన్స్‌కు నిరాశేనా?.. అంచనాలు తారుమారు
ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘బద్రి’ చిత్రాన్ని కాకుండా ‘పంజా’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చిందంటే చాలు అభిమానులు ఆయన బర్త్‌డేను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా వారి సినిమాలను రీ రిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారింది. అభిమానులు కూడా భారీ ఎత్తున థియేటర్లకు వెళ్లి తమ అభిమాన హీరోను వెండితెరపై చూసి సందడి చేస్తున్నారు. దాంతో ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏ సినిమా రీ రిలీజ్ కానుందనే ఆసక్తి అభిమానుల్లో చాలా కాలంగా నెలకొంది. గత కొంతకాలంగా ‘బద్రి’ సినిమాను పవన్ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి ‘బద్రి’ కాకుండా ‘పంజా’ సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘పంజా’ సినిమా పవన్ లుక్స్, స్టైలిష్ మూమెంట్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ‘బద్రి’తో పోలిస్తే అంత పెద్ద స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేదని కొందరు భావిస్తున్నారు. దాంతో చాలా మంది పవన్ అభిమానులు ‘బద్రి’ సినిమాను రీ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ‘పంజా’ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ సూపర్‌గా ఉంటాయని, ఈ సినిమా కూడా రీ రిలీజ్‌లో అభిమానులను అదిరిపోయే రేంజ్‌లో అలరిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.






