- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరంజీవి వద్దకు చేరిన ఎగ్జిబిటర్ల పంచాయితీ.. ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ
ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సభ్యులు చిరంజీవిని కలవనున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంట్ విధానంలోనే చెల్లింపులు చేస్తామని చెబుతుండగా, ఎగ్జిబిటర్లు మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్ల మాదిరిగా షేరింగ్ విధానం కావాలని, అది ఎంత శాతం అనేది కూర్చొని మాట్లాడుకుందామని అంటున్నారు. ఒక దశలో “మా సమస్య పరిష్కారం కాకపోతే ‘పెద్ది’ సినిమాకు కూడా థియేటర్లు ఇవ్వం” అని ఎగ్జిబిటర్లు హెచ్చరించారు.
అయితే ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్లే కనిపించింది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, రెంట్ - పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. అలాగే ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అంతా సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు. దీంతో వివాదం ముగిసినట్లే అని చాలామంది భావించారు. కానీ తాజాగా చూస్తే నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో ‘పెద్ది’ సినిమా విడుదల పరిస్థితి ఎలా ఉంటుందా? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇ
లాంటి పరిస్థితుల్లో ఈ పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లినట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పర్సంటేజ్ విధానంలోనే ‘పెద్ది’ సినిమా విడుదల అంశంపై చర్చించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి చిరంజీవి సమక్షంలో అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? లేదా అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.






