Adipurush : ‘ఆదిపురుష్’.. కృతిసనన్ లుక్‌పై భిన్నాభిప్రాయాలు

by Disha Web Desk 9 |
Adipurush : ‘ఆదిపురుష్’.. కృతిసనన్ లుక్‌పై భిన్నాభిప్రాయాలు
X

దిశ,సినిమా: రామాయణం అంటే రాముడు నడచిన మార్గం అని అర్థం. దానికి మరో పేరు సీతాయణం. అంటే రాముని వెంట నటించిన ధర్మపత్ని సీతమ్మ దేవి కారణంగా దీన్ని సీతాయణం అని కూడా పిలుస్తారు. ఇంతటి అద్భుతమైన రామాయణంలో సీత పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాంటి పాత్రలో నటించిన మన హీరోయిన్లు కొంతమంది చేసి మంచిపేరు సంపాదించుకున్నారు. అయితే రామ కథతో వచ్చిన తొలి సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో విడుదలైన ఈ సినిమాలో యడవల్లి సూర్యనారాయణ తొలిసారి రాముని పాత్రలో కనిపించారు. ఇందులో సురబి కమలాబాయి సీత పాత్రలో నటించింది. సీతమ్మ అంటే ఇలా ఉంటుంది అని తెలిసేలా చూపించారు.

అయితే అప్ కమింగ్ మూవీ ‘ఆదిపురుష్’లో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. కాగా ఆమె లుక్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కొంతమంది కళాకారులు సీతగా ఇతర టాలీవుడ్ హీరోయిన్‌లు సీత పాత్రలో ఎలా కనిపిస్తే ఉంటారో ఊహించి AIని ఉపయోగించి పిక్స్ రివీల్ చేశారు. ఇందులో కీర్తి సురేష్, రష్మిక, సాయి పల్లవి, పూజ, కియార ఫొటోస్ సీత గెటప్‌లో ఉన్నాయి. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read more: రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఇవే!

KGF-2, పఠాన్ రికార్డులను బ్రేక్ చేసిన ‘ఆదిపురుష్’ అడ్వాన్స్ బుకింగ్స్..! (వీడియో)

ప్రభాస్ ‘ఆదిపురుష్’ మంచి విజయం సాధించాలి.. డిప్యూటీ సీఎం పోస్ట్


Next Story