Adipurush : రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఇవే!

by Disha Web Desk 9 |
Adipurush : రామాయణం ఆధారంగా వచ్చిన తెలుగు సూపర్ హిట్ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: మహాకావ్యం రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రముఖ తారాగణంతో జూన్ 16న ‘‘ఆదిపురుష్’’ చిత్రం తెరకెక్కతోన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీని వీక్షించడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే టాలీవుడ్‌‌లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమాల విషయంపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..

* లవకుశ: రాముడిగా సీనియర్ ఎన్టీఆర్, సీతగా అంజలి దేవి నటించారు. 1963లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా చాలా పెద్ద హిట్ అయ్యింది.

* సంపూర్ణ రామాయణం: బాపు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో శోభన్ బాబు రాముడిగా, చంద్రకళ సీతగా నటించింది. 1972లో విడుదలైన ఈ సినిమా కూడా కమర్షియల్‌గా మంచి సక్సెస్ అయ్యింది.

* సీతా కళ్యాణం: మరోసారి బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ రామాయణంలో రవికుమార్ రాముడిగా, జయప్రద సీతగా నటించింది. 1976లో విడుదలై పలు అవార్డులు కూడా గెలుచుకుంది.

* బాల రామాయణం: గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా, స్మితా మాధవ్ సీతగా నటించింది. 1997లో విడుదలైన ఈ సినిమాను ఏం ఎస్ రెడ్డి నిర్మించారు.

* శ్రీరామ రాజ్యం: బాలకృష్ణ రాముడిగా నటించగా, నయనతార సీతగా కనిపించింది. దీనికీ బాపు దర్శకత్వం వహించారు. 2010లో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.

* ఆదిపురుష్: రామాయణం ఆధారంగా ఇప్పటివరకు వచ్చిన హై బడ్జెట్ మూవీ ఇదే. సుమారు రూ.500కోట్లతో తెరకెక్కింది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించింది.

Also Read: మాస్ సినిమాలపై మోజెందుకో ఓపెన్ అయిన Sreeleela !

మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో రాబోతున్న కీర్తి సురేష్?



Next Story

Most Viewed