మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్ త్వరలోనే జైలుకు వెళతారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

by Mahesh |
మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్ త్వరలోనే జైలుకు వెళతారు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ శనివారం సాయంత్రం బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. కాగా శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నేను జైలు నుంచి నేరుగా మీ వద్దకు వస్తున్నాను. 50 రోజుల తర్వాత మీతో ఉండటం చాలా గొప్పగా అనిపిస్తుందన్నారు. అలాగే దేశంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తుందని.. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపి బీజేపీ నేతల రాజకీయాలను పూర్తి చేస్తారన్నారు. దీంతో పాటు మన మంత్రులు, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ పార్టీ మంత్రులు జైల్లో ఉన్నారని.. మళ్లీ బీజేపీ గెలిస్తే.. మరోసారి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, తేజస్వీ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉద్ధవ్ థాకరే తదితర ప్రతిపక్ష నేతలంతా జైల్లో ఉంటారు. కానీ బీజేపీ నేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే, ఎంఎల్ ఖట్టర్, రమణ్ సింగ్‌లు మాత్రం తమ రాజకీయాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగుతారని ఆరోపించారు.

Next Story

Most Viewed