అఫీషియల్: 'పెద్ది' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా?

by Pulgam srinivas |   (  Updated:2026-07-04 07:15:05  IST  )

పెద్ది చిత్రం జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

అఫీషియల్: పెద్ది ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన 'పెద్ది' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జూన్ 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మంచి విజయాన్ని అందుకుంది. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, జూలై 9 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో విజయవంతమైన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మైత్రి మూవీ మేకర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ షాక్.. ప్రభాస్ సినిమా షూటింగ్‌పై ఒత్తిడి?

Next Story