- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
రాజస్థాన్ పచ్‌పద్రలో రూ. 79,450 కోట్ల వ్యయంతో నిర్మించిన దేశపు తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ప్రారంభించిన పీఎం నరేంద్ర మోడీ

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీంతో దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజస్థాన్‌లోని బాలోత్రా జిల్లా పచ్‌పద్రలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను (Greenfield Refinery-cum-Petrochemical Complex) ఏర్పాటు చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో, దాదాపు రూ. 79,450 కోట్ల భారీ పెట్టుబడి తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
జోధ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ న్యూ టెర్మినల్ ప్రారంభం
వార్షికంగా 9 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) రిఫైనింగ్ సామర్థ్యం, 2.4 MMTPA పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రిఫైనరీ ని రూపొందించారు. ఇది పశ్చిమ రాజస్థాన్‌లో పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కేవలం రిఫైనరీనే కాకుండా రాజస్థాన్‌లో దాదాపు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో రూ. 13,000 కోట్ల జైపూర్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు శంకుస్థాపన, రూ. 480 కోట్లతో నిర్మించిన జోధ్‌పూర్ విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనం ప్రారంభోత్సవం, సవరించిన ‘ఉడాన్’ (UDAN) ప్రాంతీయ కనెక్టివిటీ పథకం ప్రారంభం వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా, వేడుక వేదికగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన సుమారు 54,000 మంది అభ్యర్థులకు ప్రధాని నియామక పత్రాలను (Appointment Letters) పంపిణీ చేశారు.






