- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'KING100' గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అఖిల్
నాన్న కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా 'KING100' నిలుస్తుందని అఖిల్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ తాజాగా 'లెనిన్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో అఖిల్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మూవీని జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన తండ్రి నాగార్జున ప్రతిష్ఠాత్మక 'KING100' సినిమా గురించి ఓ సూపర్ అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో ఆసక్తిని పెంచాడు. తాజా ఇంటర్వ్యూలో అఖిల్‌ను, "నాగార్జున గారి 'KING100' సినిమా షూటింగ్ చాలా సైలెంట్‌గా జరుగుతోంది. ఎలాంటి అప్డేట్లు కూడా రావడం లేదు.
ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి?" అని ప్రశ్నించారు. దానికి అఖిల్ స్పందిస్తూ, "నాన్నగారు 'KING100' సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయన కెరీర్‌లోనే ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నాగార్జున 100వ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఉండగా, అఖిల్ ఇచ్చిన తాజా అప్డేట్ మరింత హైప్‌ను తీసుకొచ్చింది.






