- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా కొడుకు నీ అభిమాని.. బాగా బుద్ధి చెప్పావ్: సాయికృష్ణ తల్లి
తన కుమారుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని, కానీ తమకు బాగా బుద్ధి చెప్పారంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అన్నారు. తమ కుమారుడి బూడిదైనా ఇప్పిస్తే కనీసం కార్యక్రమలైనా చేసుకుంటానని విజయవాడలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: తన కుమారుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్ అని, కానీ తమకు బాగా బుద్ధి చెప్పారంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి(Saikrishna mother Vijayalakshm) అన్నారు. తమ కుమారుడి బూడిదైనా ఇప్పిస్తే కనీసం కార్యక్రమలైనా చేసుకుంటానని విజయవాడ(Vijayawada)లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాపులం ఓట్లు వేసినందుకు తమకు బాగా జరిగిందన్నారు. తన కొడుకును లాకప్ డెత్‌కు కారణమైన ప్రతి ఒక్కరినీ శిక్షించాల్సిందేనని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. 14 ఏళ్ల అమ్మాయిని సాయికృష్ణ వేధించారని కొందరు అంటున్నారని.. ఆ కేసు ఏంటో అందరికీ తెలుసన్నారు. ఆ అమ్మాయి కూడా బహిరంగంగా మాట్లాడిందని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అయ్యే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పెద్దోళ్ళు ఎవరో ఉన్నారోనని.. అందుకే ఇలా చంపారని ఆమె ఆరోపించారు. తన కొడుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా విచారించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో పని చేసేవాడిని తీసుకొచ్చి చంపేశారని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మండిపడ్డారు.
మమ్మల్ని చంపాలని చూస్తున్నారు.. సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు






