ప్రభుత్వ విప్ ను కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు

by Batti.Sumithra |

భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉప్పునూతల వెంకటేష్ యాదవ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శనివారం ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షులు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రభుత్వ విప్ ను కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
X

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఉప్పునూతల వెంకటేష్ యాదవ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శనివారం ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షులు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Next Story