‘సిద్దిపేట్ కా షేర్' హరీశ్ రావు: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ ఆసుపత్రిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత తన్నీరు హరీశ్ రావుతో కలిసి ప్రముఖ టాలీవుడ్ నటుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సందర్శించారు.

‘సిద్దిపేట్ కా షేర్ హరీశ్ రావు: విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని శ్రీ సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ ఆసుపత్రిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత తన్నీరు హరీశ్ రావుతో కలిసి ప్రముఖ టాలీవుడ్ నటుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సందర్శించారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు 500 మంది చిన్నారులకు విజయవంతంగా ఉచిత గుండె ఆపరేషన్లు (Heart Surgeries) పూర్తయిన సందర్భంగా మేనేజ్మెంట్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సంబరాల్లో హరీశ్ రావు, విజయ్ దేవరకొండలు ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. హరీశ్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. హరీశ్ రావును ఉద్దేశించి ఆయన 'సిద్దిపేట్ కా షేర్' అంటూ సంబోధించడంతో అక్కడున్న వారంతా హర్షధ్వానాలు చేశారు. పేద చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం ఈ ఆసుపత్రి అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, వీరికి హరీశ్ రావు అందిస్తున్న మద్దతు గొప్పదని కొనియాడారు. 500 మంది చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించిన వైద్య బృందానికి, ఆసుపత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అంతకుముందు హరీశ్ రావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 6000 గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు సత్యసాయి ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారన్నారు. ప్రతి మనిషి తనకు చేతనైన సాయం చేయాలని... మనం చేసిన మంచే చివరకు మిగులుతుందని చెప్పుకొచ్చారు.

Next Story