- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రొయ్యల్లో 'వైట్ గట్' వ్యాధి.. మత్స్యశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్న ఆదేశాలు
ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యలు సాగు చేసే రైతులు వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్యలు సాగు చేసే రైతులు వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి చేరడంతో వెంటనే స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యశాఖ అధికారుల్ని అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే వ్యాధి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత సంస్థలకు సూచనలు చేశారు. రైతులకు తాజా ఎస్ఓపీ ప్రకారం అవగాహన కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రొయ్యలకు వైట్ గట్ వ్యాధి లక్షణాలపై ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో వైట్ గట్ వ్యాధికి ప్రభావితమైన ఉండి మండలంలోని మహదేవిపట్నంలో మనోజ్ వర్మ అనే రైతుకు చెందిన రొయ్యల చెరువును అధికారులు పరిశీలించారు. చెరువులో నీరు, రొయ్యలు, వాటికి వేసే ఫీడ్, ఫీకల్ నమూనాలను సేకరించి కైకలూరు ల్యాబ్ కు, భీమవరం ల్యాబ్ కు పంపారు.
రొయ్యల చెరువుల సాగులో రైతులను తీవ్రంగా నష్టపరిచే ప్రమాదకరమైన వ్యాధుల్లో తెల్లపేగు (వైట్ గట్) వ్యాధి ఒకటి. దీనివల్ల రొయ్యల జీర్ణవ్యవస్థ దెబ్బతిని, ఆహారం తీసుకోవడం మానేస్తాయి. ఫలితంగా మృత్యువాత పడి తీవ్రమైన పంటనష్టం సంభవించే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి ప్రధానంగా విబ్రియో (Vibrio) అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల, అలాగే చెరువు అడుగున వ్యర్థాలు పేరుకుపోయి బ్లూ-గ్రీన్ ఆల్గే (నాచు) వంటి విషపూరితమైన నాచును రొయ్యలు తినడం వల్ల వస్తుందని నిపుణులు చెప్తున్నారు.






