మీది తడిగుడ్డల పార్టీ: మాజీ మంత్రి అంబటి

by Vemula.Srinu Prasad |

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ..

మీది తడిగుడ్డల పార్టీ: మాజీ మంత్రి అంబటి
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)ని గొడ్డలి పార్టీ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ గొడ్డలి పార్టీ అయితే టీడీపీ(Tdp) వాళ్లది తడిగుడ్డల పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడ(Vijayawada)లో లాకప్ డెత్‌కు గురైన సాయికృష్ణ(Saikrishna) ఉదంతంపై ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ తల్లికి న్యాయం జరగాలని, అప్పటి వరకూ వైసీపీ నేతలు అండగా ఉండాలని అంబటి పిలుపునిచ్చారు.

మాధురై మాదిరి పోరాటం చేయాలి

మధురైలో జరిగిన కేసు మాదిరిగానే సాయికృష్ణ ఘటనలోనూ పోరాటం చేయాలని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి సూచించారు. ఈ కేసులు చాలా అనుమానాలున్నాయన్నారు. సాయికృష్ణను లాకప్ లోనే చంపి మృతదేహాన్ని కూడా మాయం చేశారని అంబటి ఆరోపించారు. కేసు భూస్థాపితం చేయాలని సీఐ నాగరాజు చూశారని, జగన్ సాయికృష్ణ తల్లిని పరామర్శించే వరకూ కేసు నమోదు చేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ వెళ్లకపోయి ఉంటే కేసు రిజిస్టర్ కూడా అయ్యేదికాదని ఎద్దేవా చేశారు. నాగరాజు కేసులో వాస్తవాలు బయటకు రాకుండా చేశారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

Next Story