- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కారం గ్రామస్తులు దిశకు ప్రశంసల వెల్లువ..
అక్కారం గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో అక్రమంగా ఇండ్ల ప్లాట్లు చేసిన విషయంపై దిశలో పత్రిక వరుస కథనాలపై ప్రశంసలు వస్తున్నాయి.

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అక్కారం గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో అక్రమంగా ఇండ్ల ప్లాట్లు చేసిన విషయంపై దిశ పత్రిక వరుస కథనాలు ప్రచురించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చినందుకు గ్రామానికి చెందిన ప్రజలు విద్యావంతులు ఉద్యోగులు దిశపత్రికకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. దశాబ్ద కాలంకు పైగా గ్రామంలోని పేద ప్రజల నిమిత్తం ప్రభుత్వం ఆనాడు సర్వే నెంబర్ 102 ఆనాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు ఎకరాల భూమిని కేటాయించగా అందులో ఐదు గుంటల భూమి గత ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణానికి రెవెన్యూ శాఖ కేటాయించింది.
అక్రమంగా ఒక ఎకరా భూమిని...
పై స్థలంలో ఎలాంటి తీర్మానాలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్లాట్లుగా ఏర్పాటు చేసి సొమ్ము చేసుకునే ప్రయత్నాలను దిశపత్రిక వెలుగులోకి తేవడంతో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పట్టి భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడడం దిశలో వరుస కథనాలు రావడం వలన సాధ్యమైందని గ్రామస్తులు, విద్యావంతులు, యువకులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ పత్రిక యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సర్వేనెంబర్ సర్వేనెంబర్ 103 లో రెండు ఎకరాల గ్రామ కంఠం కు చెందిన ప్రభుత్వ భూమిలో అదే గ్రామంలో గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి తన భార్య పేరున అక్రమంగా ఒక ఎకరా భూమిని చేయించుకోవడంతో పాటు.. ఆ స్థలములో ఒక ప్రైవేటు సంస్థకు చెందిన సిగ్నల్ ఏర్పాటుకు అద్దెకిచ్చి ప్రతినెల సంస్థ ద్వారా డబ్బులు అక్రమంగా పొందుతూన్న వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి..అట్టి భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకొని చట్టం ప్రకారం శిక్షించి అక్రమంగా సొమ్ము చేసుకున్న ధనాన్ని రికవరీ చేసి గ్రామానికి చెందిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.






