యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్ట్‌.. ఐదోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు

by Ajay Maddhiboyina |

యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగుసార్లు రావణ్ ను అరెస్ట్ చేయగా, నాలుగు సార్లు బెయిల్ వచ్చింది. ఎలమంచిలి కోర్టులో రావణ్ బెయిల్ రాగా విడుదలై కాసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్ట్‌.. ఐదోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగుసార్లు రావణ్ ను అరెస్ట్ చేయగా, నాలుగు సార్లు బెయిల్ వచ్చింది. ఎలమంచిలి కోర్టులో రావణ్ బెయిల్ రాగా విడుదలై కాసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులో నమోదైన కేసులో రావణ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అరెస్ట్ కు ముందు రావణ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తనపై కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కావాలంటే తననను స్టేషన్ లోనే చంపేయాలని అన్నారు.

ప్రస్తుతం తాను ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నానని మూడు రోజులుగా ఏం తినలేదని చెప్పాడు. తనను చంపకుండా స్టేషన్ల చుట్టూ తిప్పినా తానే ఆహారం మానేసి చనిపోతానని అన్నాడు. తన ఒక్కడికోసం 500 మంది పోలీసులు, ఎస్పీ స్థాయి అధికారులు కాపలా ఉండాల్సి వస్తుందని చెప్పాడు. అన్ని పనులు మానుకుని పోలీసులు తన వెంట తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఏపీలో సమస్యలు ఏం లేవా అని ప్రశ్నించారు. తనపై ఎవరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో తెలుసని వ్యాఖ్యానించారు. తనను చంపవచ్చని కానీ ప్రశ్నను చంపలేరని అన్నారు.

Next Story