మాతృభాషలో ఇదే నా మొదటి సినిమా.. నటుడు శ్రీమాన్ ఎమోషనల్ కామెంట్స్

by Chukka Sudharani |

తెలుగు నటుడే అయినప్పటికీ కోలీవుడ్ సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు నటుడు శ్రీమాన్.

మాతృభాషలో ఇదే నా మొదటి సినిమా.. నటుడు శ్రీమాన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: తెలుగు నటుడే అయినప్పటికీ కోలీవుడ్ సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు నటుడు శ్రీమాన్. అలాగే తాను నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి అంటే ఆయన స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకునేవాడు. కానీ ఇప్పటి వరకు తెలుగులో ఆఫర్ మాత్రం రాలేదు. అయితే.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో వచ్చిన మొదటి తెలుగు ఆఫర్ అంటూ ఓ స్పెషల్ వీడియో షేర్ చేశాడు శ్రీమాన్. ఈమేరకు.. ‘నేను తెలుగు నటుడినే అయినప్పటికీ నాకు తెలుగులో మాత్రం ఆఫర్లు రాలేదు. నా తమిళ సినిమాలకు తెలుగులో నేను డబ్బింగ్ చెప్పుకుని.. నేను తెలుగు నటుడినే నాకు తెలుగు వస్తది ఆఫర్లు ఉంటే ఇవ్వండి అని అడగాలని చాలా సార్లు అనుకున్నా కానీ అడగలేదు. అయితే.. ఇన్నేళ్లకు నా కోరికను అనీల్ రావిపూడి తీర్చేశారు. నా మాతృభాష తెలుగులో మొదటి సినిమా చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను నేను ఒకసారి గిచ్చుకున్నాను. ఈ అవకాశం కల్పించిన అనీల్ రావిపూడికి ధన్యవాదాలు. కాగా.. అనీల్ రావడిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయికలో వస్తున్న మల్టీ స్టారర్ ప్రాజెక్టులో తాను కూడా భాగం అయినట్లు చెప్పుకొచ్చాడు నటుడు శ్రీమాన్. ప్రజెంట్ ఆయన షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story