- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను ఆపాలంటే చంపాల్సిందే.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తిరుగుబాటు చేసిన వాళ్లను, రెబల్ నేతలను ద్రోహులు అని విమర్శించారు. ఎన్నికల్లో నిలబడేందుకు పార్టీ గుర్తు ఇచ్చింది, నామినేషన్లపై సంతకాలు చేసింది తానేనని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమబెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తిరుగుబాటు చేసిన వాళ్లను, రెబల్ నేతలను ద్రోహులు అని విమర్శించారు. ఎన్నికల్లో నిలబడేందుకు పార్టీ గుర్తు ఇచ్చింది, నామినేషన్లపై సంతకాలు చేసింది తానేనని చెప్పారు. తిరుగుబాటువర్గంలో తాను ఎప్పటికీ కలవబోనని స్పష్టం చేశారు. పార్టీ గుర్తు తనకు విదేయంగా ఉన్నవారివద్దనే ఉంటుందని అన్నారు. పార్టీ గుర్తు ఎక్కడకీ వెళ్లలేదని తనను ఆపాలంటే తనను చంపేయాలని షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రాణాలతో ఉన్నంతవరకు తనను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.
పార్టీ గుర్తు ఎక్కడికీ పోదని, టీఎంసీని బలహీనపరిచే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. చంద్రిమా భట్టాచార్య రాజీనామా చేశారని, తాను రాజీనామా చేస్తానని ముందే చెప్పారని అన్నారు. ఆమె కుమారుడు టీఎంసీ వ్యతిరేఖవర్గంతో చేతులు కలిపారని వ్యాఖ్యానించారు. ఒత్తిడి వల్లనే బీజేపీతో చేతులు కలిపారని తాను కానీ, తన పార్టీ కానీ ఎప్పటికీ తలవంచబోమని స్పష్టం చేశారు. టీఎంసీ కార్యాలయాన్ని తాము అద్దెకు తీసుకున్నామని 2027వరకు లీజుకు తీసుకున్నామని తెలిపారు. అది పార్టీ ఆస్తి అని తాను దానిని స్వాధీనం చేసుకోలేని అన్నారు.






