భర్తగా అలాంటి వాడే కావాలి.. శ్రీలీల హాట్ కామెంట్స్

by Chukka Sudharani |

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు తగ్గిన విషయం తెలిసిందే.

భర్తగా అలాంటి వాడే కావాలి.. శ్రీలీల హాట్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు తగ్గిన విషయం తెలిసిందే. దీంతో బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా, అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తోన్న ‘తు మేరీ జిందగీ హై’లో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రజెంట్ ఈ సినిమాపైనే శ్రీలీల తన ఆశలన్నీ పెట్టుకోగా.. ఈ మూవీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. శ్రీలీల పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన లైఫ్ పార్ట్‌నర్‌లో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి తెలిపింది. ‘నాకు లైఫ్ పార్ట్‌నర్‌గా వచ్చే వ్యక్తి కేవలం లుక్స్ మాత్రమే కాకుండా, వ్యక్తిత్వం బాగుండాలి, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం ఉండాలి. ముఖ్యంగా అతనికి మూడు లక్షణాలు ఉండాలి. అతను చాలా సెన్సిబుల్‌గా ఉండాలి. అలాగే ఇతరుల భావాలను గౌరవించే సెన్సిటివ్ మనస్తవ్వం ఉండాలి. వీటన్నింటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అతనికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.

Next Story