- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న రోగం అదే.. ఆర్‌జీవి షాకింగ్ కామెంట్స్
వివాదాస్పద కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు.

దిశ, సినిమా: వివాదాస్పద కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఈసారి ఆయన దర్శకులు, రైటర్స్ మైండ్‌సెట్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మేరకు ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘చిత్ర పరిశ్రమలోని వారందరం ఒక ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నాం. మనకు మనస్ఫూర్తిగా నచ్చిన, మనం బలంగా నమ్మిన ఒక కథను నిజాయితీగా తెరపై చెప్పడం ఎప్పుడో మానేశాం. ప్రేక్షకులకు లేదా ఇతరులకు ఏం నచ్చుతుంది, ఎలా నచ్చుతుంది అని ముందుగానే ఊహించుకుంటూ అలాంటి కథలనే వండటానికి ప్రయత్నిస్తున్నాం. ఇదే ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద రోగం. నేటి తరం మేకర్స్ క్రియేటివ్ ఫ్రీడమ్‌ను పక్కనపెట్టి, కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు, మార్కెట్ సమీకరణాలు, రొటీన్ ఫార్ములాల వెనక పరిగెడుతున్నారు. దీనివల్ల సినిమాల్లో ఒరిజినాలిటీ పూర్తిగా మిస్ అవుతోంది. ఆడియన్స్ పల్స్ పేరుతో మేకర్స్ ముందే ఒక అంచనాకు వచ్చేసి... కథ డిమాండ్ చేయకపోయినా అనవసరమైన ఫైట్లు, పాటలు, లవ్ ట్రాక్‌లు వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం వల్ల సినిమా అసలు ఆత్మ దెబ్బతింటుంది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.






