- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
250వ స్వాతంత్య్ర దినోత్సవం.. ట్రంప్ నకు మోడీ శుభాకాంక్షలు
by Naga Rani Yarlagadda |
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు, అమెరికన్లకు ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు, అమెరికన్లకు ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారకు. 140 కోట్ల మందికి పైగా భారతీయుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఇరుదేశాలు స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని, ఇదే బంధం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇరుదేశాల్లో ఉన్న ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ప్రజల అపరిమిత సామర్థ్యాలు ప్రపంచ శ్రేయస్సు దోహదపడుతున్నాయన్నారు. మరో 250 ఏళ్లు అమెరికా ఇదే వేగంతో ముందుకు వెళ్లాలని, ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరాలని పోస్టులో పేర్కొన్నారు.
Next Story






