తూరుబాక మలుపులో ఘోర రోడ్డు ప్రమాదం

by Batti.Sumithra |

మండల పరిధిలోని తూరుబాక గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పై మూల మలుపు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

తూరుబాక మలుపులో ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని తూరుబాక గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పై మూల మలుపు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మలుపు తిరిగే క్రమంలో వాహనం పై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీ కొన్నారు. ప్రమాద తీవ్రతకు ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Next Story