అపార్ట్మెంట్ పై అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

by Taduka Kalyani |

కొండాపూర్ ఎస్.ఎం.ఆర్ వినయ్ ఐకానియా అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు

అపార్ట్మెంట్ పై అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
X

దిశ, శేరిలింగంపల్లి : కొండాపూర్ ఎస్.ఎం.ఆర్ వినయ్ ఐకానియా అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త అన్మోల్ కుమార్ తో కలిసి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. అపర్ణ అన్మోల్ అరుణ్ (36 ) తన ఆరేళ్ళ కుమార్తె ఆటిజం సమస్యతో పాటు మాటలు రావడం లేదని తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.

Next Story