- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓనర్ ఇంట్లో చోరీ.. ముగ్గురు నిందితులు అరెస్ట్...
బట్టల షాప్ ఓనర్ ఉమ్రాకు వెళ్లడంతో తన వద్ద పనిచేసే ముగ్గురు యువకులు ఇల్లు గుల్ల చేసిన సంఘటనలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, కార్వాన్ : బట్టల షాప్ ఓనర్ ఉమ్రాకు వెళ్లడంతో తన వద్ద పనిచేసే ముగ్గురు యువకులు ఇల్లు గుల్ల చేసిన సంఘటనలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పురుషోత్తం రావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... హబీబ్ నగర్ ప్రాంతానికి చెందిన అక్బర్ మొయినుద్దీన్ బట్టల వ్యాపారి. అయితే ఇతని వద్ద తన బంధువులైన రమీష్ మొహిద్దిన్ (23), మొహమ్మద్ యూనుస్ (35), తో పాటు పూలే సందీప్ ఈ ముగ్గురు బట్టల షాపులో పని చేస్తున్నారు. అయితే షాపు ఓనర్ గత కొన్ని రోజుల క్రితం అక్బర్ మొయినుద్దీన్ ఉమ్రాకు వెళ్లాడు. ఈ క్రమంలో జులై ఒకటో తేదీన తెల్లవారుజామున ముగ్గురు కలిసి ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా, అక్బర్ వద్ద పనిచేసే ముగ్గురు వ్యక్తులే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద 15 తులాల బంగారు నగలతో పాటు 12 లక్షలు 50 వేల నగదు, లక్షన్నర విలువైన రోడో వాచ్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని శనివారం నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సీఐ పురుషోత్తం తెలిపారు.






