అభివృద్ది పేరు చెప్పి బీజేపీ నేతలకు ఓట్లు అడిగే దమ్ముందా: మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

అభివృద్ది పేరు చెప్పి బీజేపీ నేతలకు ఓట్లు అడిగే దమ్ముందా? రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకుని బీజేపీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

అభివృద్ది పేరు చెప్పి బీజేపీ నేతలకు ఓట్లు అడిగే దమ్ముందా: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అభివృద్ది పేరు చెప్పి బీజేపీ నేతలకు ఓట్లు అడిగే దమ్ముందా? రాముడు పేరు చెప్పి ఓట్లు దండుకుని బీజేపీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు చోరీ చేశారని, సర్ కార్యక్రమం ఓట్లను జత చేసే కార్యక్రమం, ఇప్పుడు ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ కాంక్లేవ్‌ శనివారం హైదరాబాద్ లోని ఎఫ్‌టీసీసీఐలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీహార్, వెస్ట్ బెంగాల్ లో ఏమి జరిగిందో చూశామని, బెంగాల్ లో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించి 30 లక్షలకు పైగా ఓట్లు మాత్రమే జత చేశారని ఆయన ఆరోపించారు.

మోదీ భ్రమలు వీడాలని, గొప్ప గొప్ప మహారాజులు కాలంలో కలిసిపోయారని మహేష్ కుమార్ విమర్శించారు. భారత్ జోడో యాత్ర నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని, ఆయన నినాదం స్పూర్తితో 100 సంవత్సరాల తర్వాత కుల సర్వే నిర్వహించామన్నారు. కుల సర్వేతో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందని, రాహుల్ గాంధీ మిషన్ లో చేరి అప్రజాస్వామిక పాలన పై పోరాడాలని మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ క్యాడర్ కి సూచించారు. పేపర్ లీకులతో విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని, అధికారమే పరమావదిగా మోదీ, అమిత్ షా తీరు ఉందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ అని, రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న కుట్రకు తెరలేపారని ఆయన ఆరోపణలు గుప్పించారు.ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, యువ కాంగ్రెస్ నాయకులు హాజరైన ఈ సదస్సులో రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు సమకాలీన న్యాయ అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబ, కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాతే, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ కృష్ణ అలవేరు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడీ శివ చరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story