- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లాధికారులతో ప్రాధాన్యత అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని సమావేశానికి సమగ్ర సమాచారంతో హాజరు కావాలని ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికి కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను తెలిపి, ముందస్తుగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ సమావేశానికి రాని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి గైర్హాజరు అయిన సదరు అధికారులకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, సమీక్షా సమావేశాల పట్ల అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.






