సీ అండ్ డీ వేస్ట్ పారవేస్తే రూ.10 లక్షల జరిమానా

by Naga Rani Yarlagadda |

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ వ్యర్థాలను పారవేస్తే రూ.10లక్షలు జరిమానా విధించనున్నామని సీఎం కమిషనర్ జి.సృజన హెచ్చరించారు.

సీ అండ్ డీ వేస్ట్ పారవేస్తే రూ.10 లక్షల జరిమానా
X
  • వచ్చే మార్చిలో ఖాజాగూడ, ట్రిపుల్ ఐటీ ఫ్లైఓవర్లు పూర్తి
  • ఫుడ్ సేఫ్టీకి, హోటళ్లకు రేటింగ్
  • ప్రజా ఫిర్యాదులకు లిఖిత పూర్వక సమాధానం
  • మీడియా చిట్‌చాట్‌లో సీఎంసీ కమిషనర్ జి.సృజన

దిశ, తెలంగాణ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ వ్యర్థాలను పారవేస్తే రూ.10లక్షలు జరిమానా విధించనున్నామని సీఎం కమిషనర్ జి.సృజన హెచ్చరించారు. శనివారం న్యాక్ భవనంలోని సీఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆమె చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే గ్రీవెన్స్‌ల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుకు వారంలోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.

హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, వాటి ప్రమాణాలను బట్టి రేటింగ్ ఇవ్వనున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యమని, రేటింగ్ ఆధారంగా ఏ హోటల్‌ను ఎంచుకోవాలనేది పూర్తిగా ప్రజల నిర్ణయమని పేర్కొన్నారు. ప్రస్తుతం పిల్లల్లో ఫోన్ వినియోగం అధికమై వ్యసనంగా మారడానికి ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమేనన్నారు. నగరంలోని ఖాళీ స్థలాలను వినియోగిస్తూ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వారికి అనువైన ఫిజికల్ యాక్టివిటీ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇటీవల ఇరాన్‌తో నెలకొన్న పరిస్థితుల కారణంగా బిటుమెన్ (బీటీ) సరఫరాలో అంతరాయం ఏర్పడి రోడ్ల కార్పెటింగ్ పనులు మందగించాయని, ప్రస్తుతం ఆ సమస్య పూర్తిగా పరిష్కారమై పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. సీఎంసీ పరిధిలో మొత్తం 54 వాటర్ లాగింగ్ పాయింట్లు గుర్తించామని, అందులో 38 ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లోనూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో క్లౌడ్‌ బరస్ట్ వంటి తీవ్ర వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

టీడీఆర్‌లు జారీ కాకపోవడం వాస్తవమేనని, నిధుల కొరత కారణంగా భూసేకరణ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయిందన్నారు. అయితే హెచ్‌-సిటీ పనులకు సంబంధించిన భూసేకరణను త్వరలోనే ప్రారంభించి, భూ యజమానులకు పరిహారంగా టీడీఆర్‌లను జారీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎంసీకి చెందిన ఆస్తుల గుర్తింపు కార్యక్రమంలో ఇప్పటివరకు 777 ప్రభుత్వ ఆస్తులను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో సుమారు 440 ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు. అలాగే నగర ట్రాఫిక్‌ను మెరుగుపరిచేందుకు 74 ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఖాజాగూడ–ట్రిపుల్ ఐటీ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. హెచ్‌సిటీ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. నగర పరిశుభ్రతకు భంగం కలిగించే సీ అండ్ డీ (కన్‌స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్) వ్యర్థాలను రోడ్ల పక్కన పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు అవసరమైతే సం

Next Story