డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్ సింగ్‌ను కలిసిన ఏరియా జీఎం షాలేం రాజు

by Batti.Sumithra |

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్‌ను యల్లందు గెస్ట్ హౌస్‌లో సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్ సింగ్‌ను కలిసిన ఏరియా జీఎం షాలేం రాజు
X

దిశ, కొత్తగూడెం, సింగరేణి : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్‌ను యల్లందు గెస్ట్ హౌస్‌లో సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు. అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి కార్యక్రమాల అమలులో అటవీ శాఖ విశేష సేవలు అందించాలని కోరారు. అలాగే, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సింగరేణి సంస్థ చేపడుతున్న హరితహారం, మొక్కల పెంపకం, గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి తదితర కార్యక్రమాలను షాలేం రాజు వివరించారు. అటవీ శాఖ–సింగరేణి సంస్థల మధ్య పరస్పర సహకారంతో పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, గనుల పరిసర ప్రాంతాల్లో పచ్చదనాన్ని మరింత పెంపొందించే కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు వీకేసీ ఎం (వీకేసీ) ప్రాజెక్టు అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Next Story