- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్తీ దవాఖానలో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ బస్తీ దవాఖానలో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ ఒక పోస్టును భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, మహబూబాబాద్ టౌన్: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో మహబూబాబాద్ బస్తీ దవాఖానలో కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ ఒక (01) ఖాళీ పోస్టును భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవి రాథోడ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎంబిబిఎస్ డిగ్రీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అర్హత కలిగి ఉండాలని దరఖాస్తు నమూనా మరియు మార్గదర్శకాలను జిల్లా అధికారిక వెబ్సైట్ www.mahabubabad.telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని పూర్తిగా నింపిన దరఖాస్తును అవసరమైన ధృవపత్రాల ప్రతులతో తేదీ.06-07-2026 నుండి 09-07-2026 వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయ పని దినాలలో కలెక్టరేట్ లోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, మహబూబాబాద్‌లో సమర్పించవలెనని తెలిపారు. దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధృవపత్రాల ప్రతులను తప్పనిసరిగా జతచేయాలని డిమాండ్ డ్రాఫ్ట్ OC అభ్యర్థులు 500/- BC,SC,ST అభ్యర్థులు 300/- దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా సమర్పించవలెనని దరఖాస్తుల స్వీకరణ సమయం అనంతరం సమర్పించే ధృవపత్రాలు పరిగణనలోకి తీసుకోబడవని అధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.






