- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్ హౌస్‍లోనే కుంగి కృశించి పోవాలి.. KCRపై రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్
పాలమూరు బిడ్డ పరిపాలనకు పనికిరాడా?.. దొరల అహంకారాన్ని బొంద పెట్టాలని మిడ్జిల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ మళ్లీ అధికారం అనేది కల మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతిని గొలుసులతో బంధించినట్లు కేసీఆర్‍ను ఫాంహౌస్‍లో ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గొలుసులతో బంధించారని ఇక ఆయన అక్కడే కుంగి కృశించి పోవాలి తప్ప అధికారం అనేది గతం అన్నారు. ప్రతిపక్ష నాయకుడి పదవి వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడరట కానీ అధికారం ఇస్తే దోచుకునేందుకు మాత్రం బయటకు వస్తారట అని ఎద్దేవా చేశారు. తన రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా మిడ్జిల్‍లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం పాల్గొని మాట్లాడారు.
పాలమూరు బిడ్డ పరిపాలనకు పనికిరాడా?:
తనకు అనుభవం లేదని చాలా మంది నన్ను అవహేళన చేశారని సీఎం మండిపడ్డారు. దొరలకు సమస్యలపై అవగాహన ఉండకపోవచ్చు కానీ పేదల మధ్య పెరిగిన నాకు సమస్యలు తెలియదా? తట్టపనికి, మట్టిపనికి మనమే బిడ్డలు కావాలి కానీ పరిపాలనకు పాలమూరు బిడ్డ పనికిరారా? ఇలాంటి దురహంకారాన్ని బొంద పెట్టాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందన్నారు. అహంకారానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. అహంకారం, అహంభావం పేట్రేగిపోయి గద్దరన్నను గడీల ముందు నాలుగు గంటలు ఎర్రటి ఎండలో కుర్చోబెట్టిన వ్యక్తిని మనం క్షమించాలా? గద్దర్‍ను ఎండలో నిలబెట్టినా కేసీఆర్‍ను ఉరేసినా తప్పులేదన్నారు.
ప్రజాపాలన ఎందుకు పోవాలి:
ప్రజాపాలన పోవాలని, పాపాల భైరవుడు మళ్లీ రావాలని కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఆయన అల్లుడు హరీశ్ రావు గద్దల్లా ఉర్లమీద పడి అంటున్నారని సీఎం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తప్పులను, అబద్ధాలను ప్రజలు క్షమించారు. కానీ రాష్ట్రం వచ్చాక పదేళ్లలో చేసిందేంటి? ఇసుక దోపిడీకి అడ్డువచ్చిన నేరెళ్ల దళితులను లారీలతో తొక్కించారు. పంటలకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారు. ప్రశ్నాపత్రాలను పల్లీబఠాణిల్లా అమ్ముకున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినందుకు, సన్న బియ్యం ఇచ్చినందుకా? ఉచిత కరెంట్, మహిళలకు ఇచిత బస్సు ప్రయాణం కల్పించినందుకా ఎందుకు ప్రజా పాలన పోవాలని నిలదీశారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో ఎక్కడికక్కడ చర్చ పెట్టాలన్నారు.






