- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో రూ.85వేల విలువైన మెడిసిన్ భారత్‌లో 35 రూపాయలే.. మహిళ వీడియో వైరల్
భారత్‌లో మందుల ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఓ అమెరికన్ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో రూ.85వేలు విలువ చేసే రెవ్లిమిడ్ అనే క్యాన్సర్ మందు భారత్ లో కేవలం రూ.35లకు లభిస్తుందని చెప్పింది.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో మందుల ఖర్చులు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఓ అమెరికన్ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలో రూ.85వేలు విలువ చేసే రెవ్లిమిడ్ అనే క్యాన్సర్ మందు భారత్ లో కేవలం రూ.35లకు లభిస్తుందని చెప్పింది. భారత్‌లో తక్కువ ధరకే వైద్యం అందుతోందని అమెరికా ఆరోగ్య వ్యవస్థ తమను దోచుకుంటోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మందుల కోసం విమానంలో భారత్ వెళ్లడమే మేలు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఇప్పటికే విదేశాల నుండి భారత్ కు పెద్దఎత్తున సర్జరీలు, ఇతర చికిత్సల కోసం వస్తున్న సంగతి తెలిసిందే. భారత్ నుండి వెళ్లి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు సైతం ఏ అనారోగ్య సమస్య వచ్చినా భారత్ కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి వెళుతుంటారు. అక్కడ డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకున్నా లక్షల్లో ఖర్చు అవుతుందని, అదే భారత్ లో వేల రూపాయలు ఖర్చు చేస్తే మెరుగైన వైద్యం దొరుకుతుందని చెబుతుంటారు. ఇప్పుడు అమెరికన్ మహిళ వీడియోతో మందులు కూడా అమెరికాతో పోలీస్తే చాలా తక్కువ అని తేలింది. దీంతో భారత్ కు ట్రీట్మెంట్ కోసం వచ్చే విదేశీయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.






