- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువులో విద్యార్థులు రాణించాలి : చందా సైదాబాబు
విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శి చందా సైదాబాబు అన్నారు.

దిశ, మునగాల : విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శి చందా సైదాబాబు అన్నారు. మునగాల మండలంలోని గణపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రతి విద్యార్థి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యతను గుర్తించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అమరబోయిన మట్టయ్య యాదవ్, కొక్కిరేణి పీఏసీఎస్ చైర్మన్ చందా చంద్రయ్య, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్, వార్డు సభ్యుడు, బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెవిరాల సీతారామయ్య, ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రణబోతు శ్రీనివాసరెడ్డి, ఉపేందర్, వెంకట్‌రెడ్డి, కె.వి. సార్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






