చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్

by Gantepaka Srikanth |

భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అధికారికంగా అడుగుపెట్టాడు.

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అధికారికంగా అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ మాంచెస్టర్లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఘనతతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా ఉన్న ఒక అరుదైన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. కేవలం 15 సంవత్సరాల, 3 నెలల, 7 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం (India Debut) చేసి, భారతదేశం తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన (Youngest Indian Cricketer) పురుష ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 1989లో పాకిస్తాన్‌పై తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో టెస్ట్ క్రికెట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేయగా, ఇప్పుడు వైభవ్ 15 ఏళ్లకే బ్లూ జెర్సీ ధరించి ఆ రికార్డును తిరగరాశాడు.

ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన వైభవ్.. తన అద్భుతమైన హిట్టింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్లో లీగ్ అత్యధిక స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ సాధించడమే కాకుండా, అసాధారణ స్ట్రైక్ రేట్‌తో పరుగులు రాబట్టి టీమిండియా సెలెక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్ పర్యటనతో పాటు ఇంగ్లాండ్ జరిగిన మొదటి మ్యాచ్‌లో అవకాశం దక్కనిప్పటికీ, శనివారం నాటి రెండో టీ20లో మేనేజ్మెంట్ అతడిని తుది జట్టులోకి తీసుకుంది. మ్యాచ్‌కు ముందే సోషల్ మీడియాలో "న్యూ చాప్టర్" అంటూ వైభవ్ పెట్టిన పోస్ట్ నిజమైంది. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన ఈ వండర్ కిడ్ భవిష్యత్తులో మరెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story