- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 18న స్పెషల్ లోక్ అదాలత్
by Taduka Kalyani |
స్పెషల్ లోక్ అదాలత్ లో అధిక మొత్తంలో కేసులు రాజీ పడేటట్లు చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ న్యాయవాదులకు సూచించారు.

X
దిశ, సిద్దిపేట అర్బన్ : స్పెషల్ లోక్ అదాలత్ లో అధిక మొత్తంలో కేసులు రాజీ పడేటట్లు చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ న్యాయవాదులకు సూచించారు. సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో న్యాయవాదులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 1324 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. జూలై 18 స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కుమార స్వామి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి తరణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, న్యాయ వాదులు, న్యాయ సేవ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






