ఏపీలో తెలంగాణ విద్యార్థుల సత్తా.. 3 గోల్డ్, 4 సిల్వర్ మెడల్స్ కైవసం

by Vemula.Srinu Prasad |

ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జరిగిన అస్మిత సౌత్ జోన్ వాటర్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్-2026 పోటీల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు...

ఏపీలో తెలంగాణ విద్యార్థుల సత్తా.. 3 గోల్డ్, 4 సిల్వర్ మెడల్స్ కైవసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖేలో ఇండియా ఆధ్వర్యంలో జరిగిన అస్మిత సౌత్ జోన్ వాటర్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్-2026 పోటీల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా గంభీరం రిజర్వాయర్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో బోయిన్‌పల్లి ట్రైబల్ వెల్ఫేర్ వాటర్ స్పోర్ట్స్ స్టూడెంట్స్.. మొత్తం 9 మెడల్స్ సాధించారు. కానోయింగ్‌ 1000 మీటర్ల పోటీల్లో 3 గోల్డ్ ఒక బ్రోంజ్ మెడల్, 500 మీటర్ల కయాకింగ్‌ పోటీల్లో 4 సిల్వర్, ఒక బ్రోంజ్ మెడల్ సాధించారు. మొడల్స్ సాధించిన విద్యార్థినులను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, జ్యోతి తదితరులు అభినందించారు.

Next Story