- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ శ్రావణ్ కామెంట్లపై డిప్యూటీ స్పీకర్ రఘురామ సీరియస్
తనపై జడ శ్రావణ్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తనపై జడ శ్రావణ్ చేసిన ఆరోపణలను నిరూపించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారు. ఆయన వెనుక ఎవరు ఉన్నారో ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. జగన్ హయాంలో అశోక్ గజపతి రాజు స్థలాన్ని శ్రావణ్ కబ్జా చేశారని ఆరోపించారు. రికార్డులు తారుమారు చేసి లీజుకు తీసుకుతీసుకున్నారని అన్నారు. ఆ స్థలంపై నోటీసులు ఇచ్చి ఆఫీసును కూల్చేయాలని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇటీవల రఘురామకృష్ణపై జడ శ్రావణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రఘురామ చర్చిలను కూల్చివేయాలని అంటున్నారని మండిపడ్డారు. ఆయన మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవుల గురించి రఘురామ మరోసారి మాట్లాడితే నాలుక కోసి పవన్ కల్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జడ శ్రావణ్ కుమార్ చేసిన కామెంట్లపై ఇప్పటికే రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది.






