- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata EVs: టాటా ఈవీలపై భారీ ఆఫర్లు
ఈ ప్రయోజనాలు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, ఇంటర్వెన్షన్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ రూపంలో ఉంటాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. జూలై నెలకు సంబంధించి కస్టమర్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. అమ్మకాలు పెంచడం, డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేసే లక్ష్యంలో భాగంగా టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, హ్యారియర్ ఈవీ, కర్వ్ ఈవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. ఈ ప్రయోజనాలు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్, ఇంటర్వెన్షన్ బెనిఫిట్, లాయల్టీ బోనస్ రూపంలో ఉంటాయి. అయితే వేరియంట్, ప్రాంతం, డీలర్‌ను బట్టి ఆఫర్లు మారే అవకాశం ఉండటంతో, తుది వివరాల కోసం డీలర్‌షిప్‌ను సంప్రదించాలని కంపెనీ సూచిస్తోంది. కంపెనీ అధికారిక వివరాల ప్రకారం, ఈ ఆఫర్లలో కర్వ్ ఈవీపై అత్యధికంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. హ్యారియర్ ఈవీపై గరిష్టంగా రూ.2.75 లక్షల వరకు బెనిఫిట్లు లభిస్తున్నప్పటికీ, ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. లాయల్టీ, ఇంటర్వెన్షన్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌ల రూపంలో ఈ ప్రయోజనాలు అందిస్తారు. టియాగో ఈవీ, పంచ్ ఈవీలపై గరిష్టంగా రూ.1.45 లక్షల వరకు తగ్గింపు ఉండగా, ఫేస్‌లిఫ్ట్‌కు ముందు వచ్చిన మోడళ్లపై మరింత ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. నెక్సాన్ ఈవీపై మాత్రం రూ.50 వేల వరకు మాత్రమే డిస్కౌంట్ లభిస్తోంది. టాటా ఈవీల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ కావడంతో నెక్సాన్‌పై తక్కువ ఆఫర్లు ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.






