- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గురుకుల ఇంటర్ మిగిలిన సీట్లకు జూలై 6న స్పాట్ అడ్మిషన్లు
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన ఇంటర్ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీ కోసం జూలై 6న హైదరాబాద్‌లోని షేక్‌పేట ఎస్సీ గురుకుల పాఠశాల–కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.

దిశ, షాద్‌నగర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన ఇంటర్ ప్రథమ సంవత్సరం సీట్ల భర్తీ కోసం జూలై 6న ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని షేక్‌పేట ఎస్సీ గురుకుల పాఠశాల–కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కొందుర్గు గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఖుర్షీద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు పదో తరగతి మెమో, బోనాఫైడ్, టీసీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, సంబంధిత ధ్రువపత్రాల రెండు సెట్‌ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. కొందుర్గు గురుకుల పాఠశాలలో మిగిలిన ఇంటర్ ప్రథమ సంవత్సరం సీట్లకు అదే రోజు షేక్‌పేట ఎస్సీ గురుకుల పాఠశాల–కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ మహమ్మద్ ఖుర్షీద్ కోరారు.






