- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన
కల్లూరు పట్టణ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

దిశ, కల్లూరు : కల్లూరు పట్టణ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నగరాభివృద్ధి పథకం కింద బీసీ హాస్టల్ ఎదురుగా–మెయిన్ రోడ్ వద్ద స్ట్రోం వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు పట్టణ పారిశుధ్యం, ప్రజల రాకపోకలకు గణనీయమైన మెరుగుదల ఏర్పడనుంది.
అనంతరం తిరువూరు 'ఎక్స్' రోడ్ వద్ద ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారి (NH-365BB) పై ఉన్న కల్లూరు జంక్షన్ అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనుల ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు రహదారి భద్రత పెరిగి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కల్లూరు పట్టణాన్ని ఆధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ ప్రాజెక్టులు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత పట్టణ ప్రజలకు మెరుగైన డ్రైనేజీ, సౌకర్యవంతమైన రహదారులు, సురక్షితమైన ట్రాఫిక్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది.






