- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త హత్యకు భార్యే మాస్టర్ ప్లాన్.. భార్యతో పాటు ఆరుగురు కటకటాల్లోకి..!
మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య హత్య కేసు సంచలన మలుపు తిరిగింది.

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. మొదట గుర్తు తెలియని దుండగుల పని అనుకున్న ఈ హత్య వెనుక భార్యే సూత్రధారి అని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హాతమార్చేందుకు పక్కా ప్రణాళిక రచించి,ఆ కుట్రలో మరో ఆరుగురిని భాగస్వాములను చేసినట్లు జిల్లా ఎస్పీ శబరీష్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మృతుడు మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్యపై అక్రమ సంబంధాల అనుమానాలతో అతనిపై ద్వేషం పెంచుకొని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో సన్నిహితులైన వ్యక్తులతో కలిసి హత్యకు భార్య యశోద పథకం రచించిందనీ.. ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని, జూన్ 30 అర్ధరాత్రి నుంచి జూలై 1 తెల్లవారుజామున మధ్య ఇంటి ముందు వరండాలో నిద్రిస్తున్న యాకయ్యపై మారణాయుధాలతో అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించి..
హత్యను దొంగల పని లేదా పాత కక్షల ఘటనగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల సాంకేతిక దర్యాప్తు నిందితుల అసలు కథను బయటపెట్టింది. సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, టవర్ లొకేషన్లు, నిందితుల కదలికలు, శాస్త్రీయ ఆధారాలన్నింటినీ విశ్లేషించిన పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన వారిలో మృతుడి భార్య పిట్టల యాశోద (A-1), గంగుల కృష్ణ (A-2), మోహన్ రెడ్డి (A-3), తుమ్మిడి నర్సమ్మ (A-4), వెంకన్న (A-5), శివ (A-6), కృష్ణమూర్తి (A-7) ఉన్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, మొబైల్ ఫోన్లు, కారు తదితర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ శబరీష్ అభినందించారు.






