- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
10,003 రాజీ యోగ్యమైన కేసులు.. 11న జాతీయ లోక్ అదాలత్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ,జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి వెల్లడించారు. ..

దిశ ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ ,జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి వెల్లడించారు. జిల్లా కోర్టు భవనంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్.శ్రీదేవి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి వరకు 10,003 రాజీ యోగ్యమైన కేసులుగా గుర్తించామన్నారు ఈ కేసులలో మధ్యవర్తిత్వం నిర్వహించి పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు. నోటీసులు అందని కక్షిదారులు తమ పరిధిలోని కోర్టులను సంప్రదించి కేసులు పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు.
ప్రస్తుతం కోర్టులలో కేసులు పేరుకు పోయాయని వాటిని పరిష్కరించ టానికి కొంత సమయం పడుతుందన్నారు. కక్షి దారులు సానుకూల, స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కారానికి కృషిచేయాలన్నారు. మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ నందు 9530 కేసులను రాజీ చేసినట్లు చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేసులు పరిష్కారానికి ప్రత్యక్షంగా పాల్గొనటానికి అవకాశం లేనివారు ఆన్లైన్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. కేసులు పరిష్కారంలో సమస్యలు ఉంటే 08812 224555 లేదా 15100 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. ఈ సమావేశంలో పర్మినెంటు లోక్ అదాలత్ చైర్ పర్సన్ ఎ.మేరీ గ్రేస్ కుమారి, తదితరులు పాల్గొన్నారు.






