కూర బొబ్బెరలో నూతన వంగడం.. 50 నుంచి 55 రోజుల్లో కోతకొచ్చే కూరగాయ

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో కేవలం 50 నుంచి 55 రోజుల్లోనే మొదటి కోతకొచ్చే నూతన కూరగాయ బొబ్బెర రకాన్ని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించింది. తెలంగాణ స్టేట్ సీడ్ సబ్ కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ నేతృత్వంలో జరిగిన స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ఈ రకాన్ని శుక్రవారం ఆమోదించింది.

కూర బొబ్బెరలో నూతన వంగడం.. 50 నుంచి 55 రోజుల్లో కోతకొచ్చే కూరగాయ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కేవలం 50 నుంచి 55 రోజుల్లోనే మొదటి కోతకొచ్చే నూతన కూరగాయ బొబ్బెర రకాన్ని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించింది. తెలంగాణ స్టేట్ సీడ్ సబ్ కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ నేతృత్వంలో జరిగిన స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ఈ రకాన్ని శుక్రవారం ఆమోదించింది. ఇది పొద రకం, ఫోటో ఇన్సెన్స్టివిటీ రకం. ఖరీఫ్, రబీ కాలాలలో సాగు అనుకూలమైనది. 85 రోజుల్లోనే ఎకరానికి సరా సరిన ఏడు నుంచి 8 టన్నుల పచ్చి కూర బొబ్బెర కాయల దిగుబడి వస్తోంది. కాయలు లేత ఆకుపచ్చగా ఉండి 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడుగుతో ఉంటాయి. చిక్కు తీయాల్సిన అవసరం లేదు. పల్లాకు తెగులును తట్టుకుంటుంది.

కాయలలో 22 శాతం ప్రోటీన్, మంచి ఫైబర్ కలిగి ఉంటుంది. కాయలలో ఐరన్, కాల్సియం, మెగ్నీషియం, పొటాష్ పుష్కలంగా ఉంటాయి. అత్యధికంగా ఫినాల్స్ ఉంటుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యాన విశ్వవిద్యాలయం విడుదల చేసిన మొట్టమొదటి కూరగాయ రకం. జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య నేతృత్వంలో, డాక్టర్ నిఖిల్, డాక్టర్ అనిత కుమారి శాస్త్రవేత్తల బృందం ఈ రకాన్ని రూపొందించింది. దీనిని రైతులు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తోందని ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ దండ రాజి రెడ్డి తెలిపారు. తమ విశ్వవిద్యాలయం రూపొందించిన నూతన కూర బొబ్బెర రకం తక్కువ కాలంలో అధిక పంట వస్తుంది. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది. సంవత్సరం అంతా సాగు చేసుకోవచ్చని రైతులకు నికర లాభాలు వస్తాయని చెప్పారు.

Next Story