- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ పార్టీ అయితే మాకేమి.. మా వాడే కదా !
మండల పరిధిలోని బాలిశెట్టిగూడెంకు చెందిన దళిత సంఘం నాయకులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.

దిశ, శాలిగౌరారం : మండల పరిధిలోని బాలిశెట్టిగూడెంకు చెందిన దళిత సంఘం నాయకులు నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. రాజకీయ పార్టీల పేరుతో విభేదాలు పెంచుకుని సొంత అన్నదమ్ములే ఎడబాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి పరిస్థితులకు భిన్నంగా బాలిశెట్టిగూడెం దళిత సంఘం నాయకులు వినూత్నంగా ఆలోచించి ఆదర్శంగా నిలిచారు. తమ స్వగ్రామానికి చెందిన చింత ధనుంజయ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నియమితులవడంతో ఏ పార్టీ అయితే మాకేమి.. మా వాడే కదా.. అనే భావంతో రాజకీయాలకు అతీతంగా ఆయనను ఘనంగా సన్మానించారు.
దళిత నాయకుడు బట్ట చిన్న సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ దళిత సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పాల్గొని ధనుంజయ్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు చింత ధనుంజయ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాటిపాముల పాపారాములు, వార్డు సభ్యులు బట్ట యశోద, శ్రీనివాస్, హరిజన కుల సంఘం నాయకులు, అంబేద్కర్ ఆర్ట్స్ అసోసియేషన్ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






